- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమలవుతున్న నైట్ కర్ఫ్యూ.. అవన్నీ బంద్
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతం కావడం, హైకోర్టు తీవ్రంగా మందలించడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి నుంచే నైట్ కర్ఫ్యూను రాష్ట్రమంతటా అమలులోకి తెచ్చింది. ప్రతీరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము ఐదు గంటల వరకు అమలుచేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నగర రోడ్లమీద ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సైతం కరోనా సోకడంతో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లమీదకు రావడం తగ్గిపోయింది. దీనికి తోడు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి రావడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ముందుగానే పనులు ముగించుకుని ఇంటి బాట పట్టారు. థియేటర్లు, క్లబ్‌లు, పబ్‌లు, బార్‌లు మూతపడడంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ తొమ్మిది గంటలకే నిర్మానుష్యంగా మారిపోయాయి.
నగరం నుంచి ఇతర రాష్ట్రాలు, ప్రధాన నగరాలకు వెళ్ళాల్సిన ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులన్నీ తొమ్మిది గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోయాయి. కర్ఫ్యూ ఆంక్షలకు అనుగుణంగా బస్సు టైమింగ్‌లను ఆయా సంస్థలు రీషెడ్యూలు చేశాయి. ఆర్టీసీ బస్సు సర్వీసులు సైతం అదే పనిచేశాయి. నగరంలోని సిటీ బస్సులు సైతం రాత్రి 8.30 గంటలకే ఆగిపోయాయి. ఇక మెట్రో రైలు సర్వీసులు సైతం రాత్రి 7.45 గంటలకే చివరి సర్వీసు ఉండేలా టైమింగ్‌ను మార్చుకున్నాయి. అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రావద్దని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసినందున ప్రజలు కూడా ఈసారి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించేలా తొందరగానే ఇండ్లకు చేరుకున్నారు.
కర్ఫ్యూను పకడ్బందీగా అమలుచేయడానికి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులు పటిష్టంగా అమలయ్యేలా చూడాల్సిందిగా ఆదేశించారు. దీంతో హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ పోలీసు పికెట్‌లు, చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. రోడ్లమీద ప్రయాణించేవారి వివరాలను పరిశీలించిన తర్వాతనే పోలీసులు అనుమతిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా పోలీసులు ముందుగానే హెచ్చరించారు. దీనికి తోడు స్థానిక సంస్థలు సైతం నైట్ కర్ప్యూ విషయంలో సిబ్బందిని రంగంలోకి దిగాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో పోలీసులు టికెట్లను పరిశీలిస్తున్నారు.
నైట్ కర్ఫ్యూ ఉత్తర్వులు రావడంతోనే థియేటర్లు ఈవెనింగ్, రాత్రి ప్రదర్శనలను నిలిపివేశాయి. రాత్రి 8.00 గంటలకే దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినందున మద్యం దుకాణాల ముందు మందుబాబులు క్యూ కట్టారు. తెల్లవారితే శ్రీరామనవమి పండుగ కావడంతో ముందుగానే వంటలకు అవసరమైన నిత్యావసరాల వస్తువులను కొనుక్కోడానికి స్థానిక మార్కెట్లలో రద్దీ పెరిగింది. హైదరాబాద్ నగరంలో నైట్ లైఫ్ ఎక్కువ కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సమయంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించినందువల్ల వైరస్ వ్యాప్తి ఒక మేరకు అదుపులోకి వస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.