- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైజీరియన్ కిలాడీ లేడీ అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో: మ్యాట్రిమోనీ మోసం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నైజీరియన్ నిందితుడిని బెయిల్‌పై విడిపించేందుకు నకిలీ పత్రాలతో కోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన నైజీరియన్ లేడీని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. 2020 మార్చి నెలలో ఒక మహిళా వైద్యురాలి నుంచి మ్యాట్రిమోనీ ద్వారా లక్షలు కాజేసి మోసానికి పాల్పడి ఢిల్లీలో నివసించే నైజీరియన్ గిడ్డీ ఐజాక్ ఓలు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఇతనికి కూకట్ పల్లి అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఇద్దరి ష్యూరిటీలపై బెయిల్ మంజూరు చేసింది. గిడ్డీ ఐజాక్‌ను బెయిల్‌పై విడుదల చేసేందుకు ఒబినా బాతోలోమెవ్, రోస్ లైన్ అన్నాలు పాస్ పోర్టు కాపీలు, అద్దె ఒప్పందం పత్రాలను ధృవీకరణకు సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించారు. ఈ పత్రాలను విచారిస్తున్న సైబరాబాద్ పోలీసులకు రోస్ లైన్ అన్నా పాస్‌పోర్ట్, వీసాలు అనుమానాస్పదంగా కన్పించాయి. మరింత లోతుగా పరిశీలించగా, వీసా నకిలీ అని తేలింది. దీంతో ఆమెను పెళ్లి సంబంధమైన మోసం కేసులోని నిందితుడు గిడ్డీ ఐజాక్ ఓలు ను విడిపించుకోవడానికి ప్రభుత్వ అధికారులను, కోర్టును మోసం చేయాలనే ఉద్దేశంతో నకిలీ వీసాను తయారు చేసినందుకు, వీసా గడువు ముగిసినా కూడా ఎలాంటి ప్రయాణ ప్రతాలు లేకుండా చట్ట విరుద్దంగా ఇండియాలో నివసిస్తున్నందుకు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసును నమోదు చేశారు.