లాభాల్లో సూచీలు..12 వేల మార్కు చేరువలో నిఫ్టీ!

by Harish |
లాభాల్లో సూచీలు..12 వేల మార్కు చేరువలో నిఫ్టీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితాలపై ఊగిసలాట కొనసాగుతుండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మొదలైన మార్కెట్లు తర్వాత కొంత ఒడిదుడుకులకు లోనైంది. మిడ్ సెషన్ సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో కొంత డీలాపడినప్పటికీ తర్వాత సూచీలు కోలుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 355.01 పాయింట్లు ఎగసి 40,616 వద్ద ముగియగా, నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 11,908 వద్ద ముగిసింది. నిఫ్టీ ఓ దశలో 12 వేల మార్కును చేరుకుంటుందని భావించినప్పటికీ చివరిలో దానికి దగ్గరగా ర్యాలీ చేసింది. నిఫ్టీలో అధికంగా ఫార్మా 2 శాతానికిపైగా దూసుకెళ్లగా, ఐటీ, బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. మెటల్, రియల్టీ రంగాలు నీరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లె ఇండియా, ఎస్‌బీఐ, టైటాన్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారం విలువ రూ. 74.74 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed