- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్డౌన్ లో ఆన్ లైన్ పాఠాలు వింటున్న ఇస్మార్ట్ హీరోయిన్
దిశ వెబ్ డెస్క్: లాక్డౌన్ వల్ల.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలంతా కూడా ఎంచక్కా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరేమో తమ పాకశాస్ర్త నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఇంకొందరు గార్డెనింగ్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. మరికొందరు చాలెంజ్ లు విసురుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. అయితే ఈస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మాత్రం డైరెక్షన్ పై దృష్టి పెట్టింది. అందుకోసం ఆన్ లైన్ పాఠాలు వింటూ తెగ బిజీగా గడుపుతోంది.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాద్ చాలా రోజుల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ప్రస్తుతం లాక్డౌన్ పీరియడ్ ను చాలా బాగా యుటిలైజ్ చేసుకుంటోంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించిన కోర్సును నిధి అగర్వాల్ నేర్చుకుంటోంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా క్లాసులు వింటున్నట్లు నిధినే స్వయంగా తెలియజేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలకు సైన్ చేసిందీ భామ. నటనే కాకుండా డైరెక్షన్ గురించి నేర్చకుంటుందంటే.. ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో మెగా ఫోన్ పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కెమెరా ముందే కాదు.. వెనక కూడా మ్యాజిక్ చేస్తుందేమో వేచి చూడాలి మరి.
tags :nidhi agarwal, online classes, ismart beauty, new york film academy