ఆ జ్ఞాపకాలు ప్రత్యేకం : ప్రియాంక భర్త

by Shyam |
Nick-Jonas
X

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త పాప్ సింగర్ నిక్ జోనస్ తన మ్యూజిక్ ప్రొఫెషన్‌లో స్పెషల్ డే గురించి షేర్ చేసుకున్నారు. ‘హ్యాపినెస్ బిగిన్స్’ ఆల్బమ్‌కు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో యానివర్సరీ స్పెషల్ నోట్ పెట్టారు. ఈ ఆల్బమ్ నుంచి ఓ ఫొటోను షేర్ చేసిన నిక్.. సుదీర్ఘ విరామం తర్వాత మ్యూజిక్‌తో తిరిగి రావడం, సోదరులుగా ఒక ప్రాజెక్ట్‌ కోసం పనిచేయడం తానెప్పుడూ మరిచిపోలేనని తెలిపారు. ప్రపంచంలోనే మన అభిమాన వ్యక్తులతో కలిసి పనిచేసే కల నిజం కావడం, ఆ పనిని అందరితో పంచుకునే అవకాశం రావడం గొప్ప విషయమని తెలిపారు. ‘హ్యాపినెస్ బిగిన్స్’ ఆల్బమ్ సృష్టించిన రికార్డులు, జ్ఞాపకాలు ప్రత్యేకమన్న ఆయన.. ఆడియన్స్ లైవ్ షోకు వెళ్లి సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నారని, దాన్ని జీవితంలో ఒక భాగంగా మలుచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. మళ్లీ ఆ క్షణాలను మీతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు నిక్.

Advertisement

Next Story