హక్కుల నేతల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు

by srinivas |
హక్కుల నేతల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్ళల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపడుతున్నారు. రెండు రాష్ట్రాలలోని పలువురి నేతల ఇళ్లల్లో సాయంత్రం 4 గంటల నుంచి ఏక కాలంలో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ నివాసం సత్తెనపల్లిలో, విరసం మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మీ నివాసం ప్రొద్దుటూరులో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు రఘునాథ్, డప్పు రమేష్ లకు చెందిన (హైదరాబాద్) ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. నిరంతరం ప్రజల హక్కుల కోసం మాట్లాడే హక్కుల నేతల ఇళ్లపై ఎన్ఐఏ ఆకస్మికంగా దాడులు చేయడాన్ని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావులు ఖండించారు.

Advertisement

Next Story