- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC టోర్నీల్లో ‘ కేన్ విలియమ్ సన్’ కెప్టెన్సీ రికార్డ్ మాములుగా లేదుగా..
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ -2021లో న్యూజిలాండ్ అదరకొడుతుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో కివీస్ గెలుపొందింది. ఈ విజయంతో 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది.ఈ మెగాటోర్నీకి ముందు న్యూజిలాండ్ జట్టును ఎవ్వరూ హాట్ ఫేవరేట్‌గా పరిగణించలేదు. కేవలం భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్టులను హాట్ ఫేవరేట్గా భావించారు.
అయితే, ఎవరూ ఊహించని విధంగా న్యూజిలాండ్ జట్టు అనూహ్యంగా ఫైనల్‌కు చేరింది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఈ టీం ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరడమే కాకుండా ఏ కెప్టెన్ చేయలేని పనిని కూడా కేవలం మూడేళ్లలోనే కేన్ మామ సాధించాడు. న్యూజిలాండ్ గత మూడేళ్లలో అద్భుత ప్రదర్శన చేస్తూ ICC టోర్నీల్లో నిలకడైన రికార్డును కొనసాగిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాయకత్వంలో చాలా అద్భుతాలు సాధించింది న్యూజిలాండ్ జట్టు. ఇటీవలి ICC టోర్నమెంట్‌లలో న్యూజిలాండ్ వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇలా కేన్ మామ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ జట్టు అద్భుతాలు చేస్తూ దూసుకుపోతోంది.