కోవిడ్-19 ఎఫెక్ట్ : న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ

by vinod kumar |   ( Updated:2020-03-07 21:20:42.0  )
కోవిడ్-19 ఎఫెక్ట్ : న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ
X

కరోనా వైరస్ (కోవిడ్ -19) ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. న్యూయార్క్ కొత్తగా మరో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 57కు పెరిగింది. అప్రమత్తమైన ఆ రాష్ట్ర గవర్నర్ అండ్రూ కయూమో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక కరోనా మృతుల సంఖ్య 19కి చేరింది. దీంతో పరిస్థితిని సమీక్షించిన గవర్నర్, కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఆరోగ్య సంస్థలలో సమస్యలు ఎదురువుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితి విధిస్తే మరింత ఎక్కువమంది సిబ్బందిని నియమించుకోవడానికి వీలుటుందని చెప్పారు.

Advertisement

Next Story