- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. పెళ్లైన 4 రోజులకే భార్యాభర్తలు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న 4 రోజులకే నూతన దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)తో అక్టోబర్ 28న పెళ్లి జరిగింది. ఈ నూతన దంపతులు కారులో సోమవారం ఉదయం పెరుంగళత్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. కూవం వద్దకు రాగానే అటువైపు నుంచి వస్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో నూతన దంపతులు మనోజ్ కుమార్, కార్తీక అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
- Tags
- cement tanker
Next Story