నవదంపతుల ఆత్మహత్య..

by srinivas |
నవదంపతుల ఆత్మహత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల వివాహం చేసుకున్న నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని భార్య కనిపించడంతో మనస్థాపం చెందిన భర్త తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతులు ప్రీతి, మచ్చేంద్రగా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story