కొత్తగా డ్రై స్వాబ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్

by Shyam |
Dry Swab RTPCR Test
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధి నిర్థారణ చేపట్టేందుకు కొత్తగా డ్రై స్వాబ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ను సీసీఎంబీ, సీఎస్ఐఆర్, ఐసీఎంఆర్ సంస్థలు ఆమోదించాయి. ఈ టెస్ట్‌లతో కరోనా వ్యాధిని వేగంగా గుర్తించ వచ్చని సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం అవలంభిస్తున్న పద్ధతుల కంటే డ్రై స్వాబ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించడం సులభమని తెలియజేశారు.

ఈ పద్ధతిని అవలంభించేందుకు దేశ వ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేటు సెంటర్లలో ప్రత్యేక శిక్షణలను అందిస్తామని సీసీఎంబీ, ఐసీఎంఆర్ సంస్థలు తెలిపాయి. వారం రోజుల్లో సెషన్లు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ద్వారా శిక్షణలు అందిస్తామన్నారు. ట్రైనింగ్ తీసుకునేందుకు ఆసక్తి ఉన్న వారు సీసీఎంబీ వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వారు నేరుగా సీసీఎంబీ డైరెక్టర్‌ను సంప్రదించి ట్రైనింగ్ తీసుకోవచ్చని తెలిపారు.

నూతన డ్రై స్వాబ్ ఆర్టీపీసీఆర్ పద్దతిలో శాంపిల్స్‌ను ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ టెస్ట్‌లకు అతి తక్కువ శాంపిల్స్ అవసరమవుతాయని తెలిపారు. అత్యంత వేగంగా, చౌకగా, ల్యాబ్ టెక్నిషియన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించే ఈ టెస్ట్‌ల ద్వారా ఫలితాలు ఆర్టీపీసీఆర్ రిజల్ట్‌తో సమానంగా వస్తాయని స్పష్టం చేశారు. పెరుగుతున్న కేసులను త్వరతగతిన గుర్తించేందుకు డ్రై స్వాబ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఉపయోగపడుతాయని సీసీఎంబీ, ఐసీఎంఆర్ సంస్థలు అభిప్రాయ పడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed