కరోనాతో న్యూజిలాండ్ ఎన్నికలు వాయిదా

by vinod kumar |
కరోనాతో న్యూజిలాండ్ ఎన్నికలు వాయిదా
X

వెల్లింగ్టన్: సుమారు వంద రోజుల తర్వాత న్యూజిలాండ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూడటంతో ఎన్నికలను నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రధాని జెసిండా అర్డెర్న్ ప్రకటించారు. జాతీయ ఎన్నికలు సెప్టెంబర్ 17న జరగాల్సి ఉన్నాయి. కానీ, కరోనా కలకలం నేపథ్యంలో ఈ ఎన్నికలను నాలుగువారలపాటు వాయిదా వేశారు.

అన్ని పార్టీల నేతలను సంప్రదించి ఎన్నికలను అక్టోబర్ 17న నిర్వహించడానికి నిర్ణయించినట్టు వెల్లడించారు. ఎన్నికలకు సిద్ధమవడానికి పార్టీలకు, ఎన్నికల కమిషన్‌కు తగిన సమయమివ్వడానికి, ఓటర్లూ సురక్షితంగా భావించి ఎన్నికల్లో పాల్గొనే వాతావరణం కోసమే వాయిదా వేస్తున్నట్టు వివరించారు. న్యూజిలాండ్‌లో ఎప్పుడు ఎన్నికల నిర్వహించాలనే నిర్ణయంపై పూర్తి అధికారం ప్రధానికే ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed