విషాదంగా మారకుండా వేడుకలు జరుపుకోవాలి :డీసీపీ

by Aamani |
విషాదంగా మారకుండా వేడుకలు జరుపుకోవాలి :డీసీపీ
X

దిశ, మంచిర్యాల: నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారకుండా వినోదంగా నిర్వహించుకోవాలని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి కోరారు. కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వేడుకల క్రమంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ నిర్వహిస్తున్నామని.. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని డీసీపీ తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడిపితే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని కోర్టులో హాజరు పర్చడం, జరిమానా లేదా జైలు శిక్షను విధించే పరిస్థితి ఉంటుందని ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఒక్కరు పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని ఎవరి ఇళ్లలో వారు ఉండి సంబరాలు జరుపుకోవాలని సూచించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులతో జిల్లా ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed