- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
58కి చేరిన యూకే వేరియంట్ కేసులు
న్యూఢిల్లీ : యూకేలో తొలిసారిగా కనిపించిన కరోనా కొత్త వేరియంట్ కేసులు భారత్‌లో క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక్క రోజులోనే కొత్తగా 20 కేసులు నమోదయ్యాయి. మనదేశంలో యూకే వేరియంట్ కేసులు మొత్తంగా 58కి పెరిగాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం నాటికి ఈ కేసులు 38 మాత్రమే ఉన్నాయి. 70శాతం వేగంగా వ్యాపించే ఈ వేరియంట్‌తో యూకేలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో యూకే పీఎం బోరిస్ జాన్సన్ ఆంక్షలు కఠినం చేస్తున్నారు.
అలాగే, ఆ దేశం నుంచి భారత్‌లోకి వచ్చే విమానాల సంఖ్యను కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. యూకేతో ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్నప్పటికీ కొత్త వేరియంట్ కారణంగా రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వారానికి కేవలం 60 విమానాలకే అనుమతించింది. తాజాగా, ఈ సంఖ్య ను మరింత తగ్గిస్తూ 30కే పరిమితం చేసింది. అలాగే, విమాన ప్రయాణానికి 72 గంటల ముందు చేసుకున్న కొవిడ్-19 టెస్టు సరిపోదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. అందుకే భారత్‌లో దిగిన తర్వాత కూడా కరోనా టెస్టు తప్పనిసరి చేశామని వివరించారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు చేసుకున్న అమెరికాలోకీ కొత్త వేరియంట్ ప్రవేశించింది. న్యూయార్క్‌లో తొలి యూకే వేరియంట్ కేసు నమోదైందని అధికారులు తెలిపారు.