మైనర్ల వివాహంలో కొత్త ట్విస్ట్

by Anukaran |   ( Updated:2020-12-04 04:31:51.0  )
మైనర్ల వివాహంలో కొత్త ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : లైకుల కోసం క్లాస్ రూంలోనే పెళ్లి చేసుకున్న యువతికి తల్లిదండ్రులు ట్విస్ట్ ఇచ్చారు. చదువుకొమ్మని కళాశాలకు పంపిస్తే.. పరువు తీసే పని చేసిందని ఇంటి గడప తొక్కనీయలేదు. దీంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాజమండ్రి కాలేజీలో ఇద్దరు మైనర్లు తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారి పెళ్లి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో వారిని, వారికి సహకరించిన స్టూడెంట్స్ ను ప్రిన్సిపల్ టీసీలు ఇచ్చి పంపించాడు.

కాలేజీకి వెళ్లిన అమ్మాయిలు తమకు తలవంపులు తెచ్చారని వారి తల్లిదండ్రులు విద్యార్థినిలను ఇంట్లోకి రానివ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. విద్యార్థినులకు ఆశ్రమం కల్పించాలని శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వివాహం చేసుకున్న స్టూడెంట్స్‌కు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళల అభివృద్ధి కి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story