- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరియమ్మ లాకప్ డెత్‌లో సెన్సేషనల్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే?
దిశ ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరియమ్మ మృతి కేసులో రోజురోజుకీ కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో దొంగతనం కేసు విచారణలో మరియమ్మ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నెల రోజులు పూర్తయ్యింది. ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే అడ్డగూడురు ఎస్ఐతో పాటు మరో ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగత్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకంటే ముందే చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను సైతం అటాచ్ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మృతురాలి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నగదు సాయం చేస్తామని ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరియమ్మ మృతికి సంబంధించి అడ్డగూడురు పోలీసు స్టేషన్ పరిధిలో రోజుకో ప్రచారం వెలుగులోకి వస్తోంది. అసలు మరియమ్మ మృతికి కారణాలు వేరే ఉన్నాయనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..?
ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన మరియమ్మ అడ్డగూడురులోని ఓ పాస్టర్ వద్ద పనిచేస్తోంది. అయితే ఇటీవల ఆ పాస్టర్ ఇంట్లో కొంత నగదు మాయం అయ్యిందని, దానికి మరియమ్మ, అతడి కుమారుడు కారణమంటూ సదరు పాస్టర్ అడ్డగూడురు పోలీసు స్టేషన్‌లో జూన్ 16న ఫిర్యాదు చేశారు. అదే రోజూ సాయంత్రం అడ్డగూడురు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్.. మరియమ్మ, ఆమె కుమారుడిని పట్టుకునేందుకు ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి వెళ్లారు. అయితే చింతకాని వెళ్లేందుకు అడ్డగూడురు పోలీసులు సదరు పాస్టర్‌ను వాహనం సమకూర్చాలని చెప్పడం.. పాస్టర్ ఓ వాహనాన్ని ఏర్పాటు చేయడంతో అందులోనే చింతకానికి వెళ్లారు. చింతకానికి వెళ్లిన అడ్డగూడురు పోలీసులు మరియమ్మ, ఆమె కుమారుడు, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. చింతకాని పోలీసు స్టేషన్‌లోనూ కొద్దిసేపు వారిని విచారించినట్టు సమాచారం. ఆ సమయంలో కొంత నగదు వారు పోలీసులకు వెనక్కి ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. అనంతరం అక్కడి నుంచి అడ్డగూడురు పోలీసుస్టేషన్‌కు జూన్ 17న వారిని తీసుకొచ్చారు. అడ్డగూడురు పోలీసు స్టేషన్‌లో విచారణ పేరుతో మరియమ్మ, ఆమె కుమారుడిని పోలీసులు విపరీతంగా కొట్టారు. ఈ క్రమంలోనే మరియమ్మ సృహ కోల్పోయిందని, ఆమెను భువనగిరి ఆస్పత్రికి తరలించాక, చనిపోయిందని పోలీసులు చెప్పారు. కానీ వాస్తవానికి మరియమ్మ పోలీసు దెబ్బలు తాళలేక స్టేషన్‌లోనే చనిపోయిందని సమాచారం.
నిజంగా దొంగతనం కేసేనా..
మరియమ్మ మృతి వ్యవహారంలో అసలు ఆమెపై పెట్టిన దొంగతనం కేసుకు పోలీసులు అంత ఫాస్ట్‌గా యాక్షన్‌లోకి దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓ పాస్టర్ తన ఇంట్లో రూ.2 లక్షలు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేస్తే.. ఆ రోజే ఖమ్మం జిల్లాకు వెళ్లి మరీ నిందితులను పట్టుకొచ్చి తీవ్రంగా కొట్టడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. వాస్తవానికి అంతకంటే భారీగా నగదు చోరీ అయిన సమయంలోనూ పోలీసుల నుంచి ఆ స్థాయిలో రియాక్షన్ కన్పించడం చాలా అరుదు. అలాంటిది కేవలం రూ.2 లక్షల కేసులో పోలీసులు అలా యాక్షన్‌లోకి దిగారంటే.. అది నిజంగా దొంగతనం కేసేనా.. లేక మరేదైనా కారణం ఉందా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ దొంగతనం కేసైతే.. పోలీసుల మీద ఒత్తిడి చేసింది ఎవరు..? ఎవరు ఒత్తిడి చేస్తే.. పోలీసులు అంతలా యాక్షన్ తీసుకున్నారనే సవాలక్ష ప్రశ్నలు స్థానికుల మదిని తొలుస్తున్నాయి. మరియమ్మ మృతి కేసులో పోలీసులను సర్వీసు నుంచి తొలగించినప్పుడు.. ఆ ఒత్తిడి చేసిన వ్యక్తి ఎవరనేది తేల్చాల్సిన అవసరం ఉంది.