- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారితో రాయభారం.. అదే టీఆర్ఎస్ కొత్త వ్యూహం!
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా అంటే అవుననే అనిపిస్తోంది. క్షేత్రస్ధాయిలో టీఆర్ఎస్ పార్టీపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై నిఘా పెట్టారు. ఆ ఆరోపణలు, విమర్శలను ఏవిధంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ శ్రేణులతో రంగారెడ్డి జిల్లా ఎన్నికల ఇంచార్జీ హరీశ్ రావు విస్తృత స్ధాయి సమావేశం సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఏవిధంగా గెలిపించుకోవాలనే అంశంపై చర్చ సుధీర్ఘంగా కొనసాగినట్లు సమాచారం.
100 మంది పట్టభద్రుల ఓటర్లకు ఒక రాష్ట్ర, జిల్లా స్ధాయి నేతలను ఇంచార్జీలుగా నియమించారు. ఈ ఇంచార్జీలు ఆ వంద మందిని ప్రతి రోజూ పోలింగ్ అయ్యేంత వరకు టచ్‌లో ఉండేటట్లు ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. ఆ వంద మందికి ఉన్న ఇంచార్జీ నమ్మకమైన నలుగురి సభ్యులతో ఓటర్లను సమన్వయం చేసుకుంటారని తెలుస్తోంది. ఏ విషయమైనా ఈ ఇంచార్జీల ద్వారానే రాయభారం కొనసాగేలా పార్టీ నేతలకు దిశా నిర్థేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే విధానం అమలు చేయాలని పార్టీ నేతలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల కంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధికి అత్యధిక ఓట్లు పోలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా నేతలను హరీశ్ ఆదేశించారు. ఈ వ్యూహంతోనే పట్టభద్రులకు గాలం వేసే పనిలో పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.