సీఎం ఠాక్రే నివాసానికి కొత్త భద్రతా సిబ్బంది

by vinod kumar |
సీఎం ఠాక్రే నివాసానికి కొత్త భద్రతా సిబ్బంది
X

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’కి సమీపంలో టీ అమ్మే చాయ్‌వాలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో తీవ్ర కలకలం రేగింది. అతని వద్ద తరుచూ ‘మాతోశ్రీ’ ఇంటి భద్రత చూసే సిబ్బంది టీ తాగేవారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 160 మంది భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఠాక్రే భద్రత చూసే బృందంలోని కొందరి సభ్యులను కూడా క్వారంటైన్ తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మాతోశ్రీ వద్ద కొత్త సిబ్బందిని నియమించారు. ముంబైలోని సబర్బన్ బాంద్రాలో ఉంది మాతోశ్రీ. కాగా, మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే 150 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1018కి చేరింది.

Tags: coronavirus, Uddhav Thackeray, house, security, Maharashtra cm

Advertisement

Next Story