- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై ఆటో డెబిట్ అంత సులువు కాదు.. ఎందుకంటే ?
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఏ వస్తువు కొన్నా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా కరెంటు, కేబుల్, టీవీ బిల్లులు ఆన్లైన్ లోనే పే చేస్తున్నారు. అయితే, ఆ బిల్లులు చెల్లించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్ ను వినియోగిస్తుంటారు. రోజువారి హడావుడి జీవితాల్లో సమయానికి బిల్లులు చెల్లించడం వీలుకానివారికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. అయితే, ఇకపై ఆటో డెబిట్సదుపాయం వినియోగించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే.. ఆటో డెబిట్రూల్స్లో భారీ మార్పులు జరగన్నాయి. క్రెడిట్, డెబిట్‌కార్డుల ద్వారా ఇకపై ఆటో డెబిట్సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు అదనపు ధృవీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరం. అక్టోబర్1 నుంచే ఈ కొత్త రూల్స్అమలులోకి రానున్నాయి. ఇకపై రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఓటీపీ అవసరం. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే పేమెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. ఈ రూల్స్ అన్ని రకాల క్రెడిట్, డెబిట్కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు వర్తించనున్నాయి.