డిసెంబర్ 11నుంచి పోస్ట్ ఆఫీస్ కొత్త రూల్స్..

by Anukaran |   ( Updated:2020-12-07 10:46:12.0  )
డిసెంబర్ 11నుంచి పోస్ట్ ఆఫీస్ కొత్త రూల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో డిసెంబర్ 11నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పోస్టాఫీసుల్లో అకౌంట్ ఉన్న వారికి మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన నిబంధనలు వర్తించనున్నాయి. ఇక మీదట మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయని వారు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారు డిసెంబర్ 11వ తేదీ నుంచి కచ్చితంగా అకౌంట్‌లో రూ.500 బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ కలిగి ఉండని వారు మెయింటెనెన్స్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త రూల్స్ ను పోస్టాఫీస్ ఇప్పటికే సేవింగ్స్ కలిగిన వారికి తెలియజేసింది.

అకౌంట్‌లో అసలు డబ్బులు లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై 4 శాతం వడ్డీ లభించనుంది. రూ.10వేల వరకు రుణం పొందిన వారికి అసలు మొత్తంపై ఎలాంటి వడ్డీ ఉండదు. మూడు ఆర్ధిక సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా లావాదేవీలు నిర్వహించాలి. అప్పుడే అకౌంట్ మూసివేయబడదు. ఇంకా కస్టమర్లకు ఏటీఎం, చెక్‌బుక్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Next Story