సీజనల్ వ్యాధుల నివారణకు కొత్త కార్యక్రమం: కేటీఆర్

by Shyam |   ( Updated:2020-05-09 08:19:50.0  )
సీజనల్ వ్యాధుల నివారణకు కొత్త కార్యక్రమం: కేటీఆర్
X

దిశ, నిజామాబాద్: రాబోయే వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణకు కొత్త కార్యక్రమం చేపడుతున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10.10గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, పూల తోటలో, కుండీలలో, పాత పనికిరాని వస్తువులలో నీళ్ళు నిల్వ ఉంటే వాటిని తొలగించాలని కేటీఆర్ సూచించారు. రానున్న వర్షాకాలంలో డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకుందామన్నారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేయదలచిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తుందన్నారు. మున్సిపల్ చైర్మన్లను, శాసన సభ్యులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఎవరి ఇండ్లల్లో వారు నిల్వ ఉన్న నీటిని పారబోయాలని దోమల లార్వా పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, ఎక్కడి వారు అక్కడ ఈ సూచనలను అనుసరించాలని తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లు చైర్మన్లు, వైస్ చైర్మన్ లు, మేయర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నివాసాలలో నీరు నిలవకుండా చూడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed