- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వైఎస్ షర్మిల కొత్తపార్టీ ? రేపు కీలక ప్రకటన !
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా? అంటే అవుననే అంటున్నాయి తెలుగు రాష్ట్రాల పొలిటికల్ పార్టీ శ్రేణులు. కొద్దిరోజులుగా వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టబోతున్నారని, త్వరలోనే పార్టీ విధి విధానాలను రూపొందించబోతున్నారని వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహింబోతున్నారన్న కీలక సమాచారం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తుంది.
అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షుడు కాగా, ఆ పార్టీ ఆంధ్రా పార్టీగా ముద్రపడింది. పార్టీలో వైఎస్ అనుచరులతో పాటు ఆయన అభిమానులు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నారు. అయితే 2014లో వైసీపీ తెలంగాణలో పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీ టీఆర్ఎస్‌లో చేరడంతో కనుమరుగైపోయింది. దీంతో ఫుల్ కాన్సంట్రేట్ ఏపీపైనే పెట్టిన జగన్.. పాదయాత్ర చేసి అక్కడ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ జైల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీని ముందుండి నడిపించారు. ఈ క్రమంలో పాదయాత్రలో భాగంగా షర్మిల ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు.
2013లో జైలు నుంచి విడుదలైన జగన్.. అప్పటి నుంచి వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తూ పార్టీ బాధ్యతలను మొత్తం తన భుజాలపై వేసుకొని, కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా చూసుకున్నారు. దీంతో జగన్, షర్మిల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని టాక్ వచ్చినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల కొన్ని ప్రధాన పత్రికలతో పాటు సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల కొత్తపార్టీ ఏర్పాటు చేయబోతున్నారని, జగన్‌తో పొసగక తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. ‘YSR అభిమానులరా రండి.. తరలి రండి! ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాది’ అని సోషల్ మీడియాలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇదేక్రమంలో ఫిబ్రవరి 9న కీలక సమావేశం ఉండబోతుందనేది రాజకీయ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతుండటంతో షర్మిల కొత్తపార్టీ ఏర్పాటు ఖాయమనే అభిప్రాయాలు జనాల్లోకి బలంగా వెళ్లిపోయాయి.
షర్మిల పార్టీకి కేసీఆర్ సపోర్టు ?
అయితే గతంలో సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన వైసీపీ అధినేత జగన్ సోదరి.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తే ప్రజలు ఏవిధంగా ఆమోదిస్తారన్నది కాస్త ఆసక్తికరంగా మారింది. మరోవైపు షర్మిల వెనుక కేసీఆర్, టీఆర్ఎస్ ప్రముఖ నేతలు ఉన్నారన్న ప్రచారం సైతం గట్టిగానే జరుగుతోంది. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని టీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యగా మారడంతో ‘రెడ్డి’ సామాజిక వర్గాన్ని చేరదీయడానికి ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ సామాన్య ప్రజల్లో అవును కదా! అనే అభిప్రాయాలు వచ్చి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పార్టీ పేరు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ?
పార్టీ ఏర్పాటు వార్తలపై ఆచితూచి స్పందిస్తోన్న షర్మిల.. పార్టీ పెట్టడం పక్కా అన్న సంకేతాలైతే ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవహారాలను నడిపిస్తూ ఏ విషయం బయటకు రాకుండా చకాచకా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఆల్‌రెడీ పార్టీ పేరు ఫిక్స్ చేసిన ఆమె అనుచరులు.. రిజిస్టర్ కూడా చేయించారన్న కీలక విషయాలు బయటకి పొక్కడంతో పార్టీ ఏర్పాటు వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఏపీలో సోదరుడు జగన్‌లా తెలంగాణలోనూ తన పార్టీని సక్సెస్ చేయాలని షర్మిల ఓ టీంను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ పేరుతో జనాల్లోకి వెళ్లి పాతుకుపోవాలంటే ఎలాంటి ఎత్తులతో ముందుకు వెళ్తే బాగుంటుందన్న విషయమై కొద్దిరోజులుగా లోటస్‌పాండ్‌లో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
వైఎస్‌కు తెలంగాణలో భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే వారిప్పుడు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నప్పటికీ షర్మిల పార్టీ అనౌన్స్ చేయగానే.. వచ్చి చేరుతారని అంచనా వేస్తున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చినప్పుడు వైఎస్ అభిమానులు వచ్చి వైసీపీలో చేరినట్లుగానే తెలంగాణలో సైతం వైఎస్, జగన్ అభిమానులు వచ్చి షర్మిల వెంట నడుస్తారన్న దాన్ని పాయింట్‌గా తీసుకొని పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నట్లు సమాచారం.
‘రాజన్య రాజ్యం.. జగనన్న సంక్షేమం’ నినాదంతో..
2014, 2019 ఎన్నికల్లో జగన్.. రాజన్న రాజ్యం తెస్తానని ప్రచారంలో పదే పదే ప్రజలకు వినిపించారు. సో.. తెలంగాణలో పార్టీని నడిపేది షర్మిలే అయినప్పటికీ జెండాపై మాత్రం రాజశేఖర్‌రెడ్డి, జగన్ ఫోటోలే ఉంటాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటివరకు సీక్రెట్‌గా పార్టీ ఏర్పాటు వ్యవహారాలపై పనులను చక్కబెట్టుకొంటూ వచ్చిన షర్మిల.. రేపటి ఆత్మీయ సమావేశంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నది తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.