జ్యోతి కిడ్నాప్ కేసులో కొత్త కోణం

by Anukaran |   ( Updated:2020-11-03 03:05:18.0  )
జ్యోతి కిడ్నాప్ కేసులో కొత్త కోణం
X

దిశ, వెబ్‎డెస్క్ :
అనంతపురం జిల్లాలో జ్యోతి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జ్యోతిని కిడ్నాప్ చేసిన వాహనాన్ని కర్నూలు జిల్లా రామాపురం దగ్గర పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వాహనాన్ని వదిలి మరో కారులో కానిస్టేబుల్ భగీరథ పరారయ్యాడు. కాగా, భగీరథ ఆవుకు పరిసరాల్లో ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే సాయంత్రానికి జ్యోతితో పాటు పోలీసు స్టేషన్ లో లొంగిపోతానని భగీరథ కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం.

ఇటీవలే జ్యోతికి భగీరథ్‌ అనే కానిస్టేబుల్‌‌తో నిశ్చితార్థం జరిగింది. కాగా.. భగీరథ్‌కు అప్పటికే పెళ్లైందని తెలిసి జ్యోతి తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేశారు.

Advertisement

Next Story