బ్రూసెల్లోసిస్ కథాకమామీషు!

by Harish |
బ్రూసెల్లోసిస్ కథాకమామీషు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 సంవత్సరంలో సమస్యలన్నింటికీ చైనానే కారణం అవుతోందనిపిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడినది చాలదన్నట్లు అక్కడ రోజుకో కొత్త వైరస్ పుట్టుకొస్తోంది. మొన్న హంటా వైరస్ అన్నారు, నిన్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అన్నారు, ఇక ఇవాళేమో బ్రూసెల్లోసిస్ అంటున్నారు. ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి బారిన పడి ఇప్పటికే చైనాలో 3000లకు పైగా మంది ఆస్పత్రుల పాలైనట్లు తెలుస్తోంది. అయితే దీని వల్ల ఇప్పటి వరకు ఎలాంటి మరణాలైతే నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో బ్రూసెల్లోసిస్ వ్యాధి గురించి కొన్ని వివరాలు మీకోసం..

కరోనా వైరస్ మాదిరిగా కాకుండా బ్రూసెల్లోసిస్ వ్యాధి ఒక బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ముందుగా పశువులు, పందులు, మేకలు, గొర్రెలు, కుక్కలకు ఈ వ్యాధి సోకింది. ఆ తర్వాత వాటిని ముట్టుకున్న వారికి, వాటిని తిన్నవారికి పాకింది. అంతేకాకుండా పశువులకు దగ్గరగా పనిచేసే వారికి కూడా గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకింది. అయితే ఎక్కువ మందికి ఈ వ్యాధి పాశ్చరైజ్ చేయని పాల ద్వారా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, చెమటలు, తలనొప్పి, కండరాల నొప్పి లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒక్కసారి వచ్చిపోవడం కాకుండా దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Advertisement

Next Story