- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూపాయి.. రూపాయి.. నువ్వెలా ఉంటావు!?
రూపాయి.. రూపాయి… నువ్వెలా ఉంటావు.. అంటే గుండ్రంగా ఉంటాను అంటుందేమో! అయితే, ఇప్పుడు రూపాయికి రూపం మారనుంది. అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం రూపాయి నోట్లను ముద్రించేది ప్రభుత్వం. తర్వాతి కాలంలో ముద్రణను నిలిపేసింది. అయితే, అప్పటి రూపాయి నోటు ముద్రణను మళ్లీ తెచ్చేందుకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది.
ఫిబ్రవరి 7న కేంద్ర ప్రభుత్వం ‘ప్రింటింగ్ వన్ రూపీ నోట్స్ రూల్స్, 2020’ పేరుతో ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో కొత్తగా ముద్రించబోయే రూపాయి నోటు రంగు, ఆకృతి, బరువు, కొలతలు ఇంకా మరిన్ని అంశాల ఆధారంగా ముద్రించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి చెలామణికి సంబంధించి అథారిటీ నోటిఫికేషన్‌ను ఇచ్చింది.
కొత్త రూపాయి నోటు కొలతలు:
కొత్తగా ముద్రించబోయే రూపాయి నోటు దీర్ఘ చతురస్రాకారలో 9.7X6.3 సెంటిమీటర్లు ఉంటుంది. పత్తితో తయారైన కాగితాన్ని ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. దీని మందం 110 మైక్రాన్లు ఉంటుంది. బరువు 90 జీఎస్ఎమ్‌లో ఉంటుంది. ఈ నోటుపై ‘సత్యమేవ జయతే’ అనే అక్షరాలు ఉంటాయి. మధ్యలో 1 అనే రూపాయి విలువను తెలిపే సంఖ్య ఉంటుంది. కుడివైపున ‘భారత్’ అనే పదాలు వాటర్‌మార్క్‌తో ముద్రించబడి ఉంటాయి.
ఆకృతి:
రూపాయి నోటుకు మరోవైపు భారత ప్రభుత్వం అనే పదం హిందీలో ఉంటుంది. అలాగే ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అతాను చక్రవర్తి సంతకం ఉంటుంది. అలాగే కొత్త రూపాయి గుర్తు ‘₹’ ఉంటుంది. నంబరింగ్ ప్యానెల్‌లో క్యాపిటల్ అక్షరం ‘L’ ఉంటుంది. గెజిట్ నోటిఫికేషన్ వివరాల ప్రకారం.. కుడివైపు దిగువన ఆరోహణ క్రమంలో సంఖ్యలు ఉంటాయి. అక్షరాలూ సంఖ్యలూ రెండూ ఉండే విధంగా మొదటి మూడు అక్షరాలు ఉంటాయి.
నోటుకు మరోవైపు.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే వాక్యం పైన భారత ప్రభుత్వం అనే పదం ఉంటుంది. అలాగే రూపాయి గుర్తు ‘₹’ తోపాటు దేశ వ్యవసాయ ఆధిపత్యాన్ని వర్ణించేలా ధాన్యాల రూపకల్పన, దాన్ని చుట్టూరా ‘సాగర్ సామ్రాట్’ చమురు అన్వేషణ వేదిక ఉంటాయి. అలాగే భాషల క్రమంలో ప్రామాణికమైన భారతీయ 15 అధికారిక భాషలు ముద్రించబడి ఉంటాయి.
రంగు :
ఇక కొత్త రూపాయి నోటుకు ప్రధానంగా గులాబీ ఆకుపచ్చ రంగుల్లో ఉండేలా ముద్రించనున్నట్టు తెలుస్తోంది.