- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో రేపే కొత్త జట్ల ప్రకటన.. పోటీలో 22 సంస్థలు
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లను చేర్చడానికి బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రెండు జట్ల కోసం 22 సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు 22 సంస్థలు టెండర్ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి. అయితే వీటిలో ఆరు లేదా ఏడు సంస్థలు మాత్రమే కొత్త జట్లపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సోమవారం కొత్త జట్లకు సంబంధించిన టెక్నికల్ డాక్యుమెంట్లను ఓపెన్ చేయనున్నారు. అయితే రేపే కొత్త జట్ల ప్రకటన చేస్తారా లేదా బీసీసీఐ మరి కొంత సమయం తీసుకుంటుందా అనే విషయంపై స్పష్టత లేదు. ఒక్కో జట్టుకు రూ.2000 కోట్ల రూపాయలను కనీస ధరగా బీసీసీఐ పేర్కొన్నది.
రెండు జట్ల టెండర్ల ద్వారా దాదాపు రూ. 7000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల ఆదాయాన్ని బీసీసీఐ ఆశిస్తున్నది. ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ఓనర్లు కూడా ఐపీఎల్‌లో కొత్త జట్టు కోసం టెండర్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. వీరితో పాటు అదాని గ్రూప్, సంజీవ్ గోయాంకా గ్రూప్, నవీన్ జిందాల్ స్టీల్, టొరెంట్ ఫార్మా, హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా, ప్రముఖ మీడియా సంస్థ హిందుస్తాన్ టైమ్స్‌తో పాటు పలు ఇతర కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. అహ్మదాబాద్, కటక్, ధర్మశాల, గౌహతి, ఇండోర్, లక్నో కేంద్రాలుగా రెండు కొత్త జట్లు రానున్నాయి. ఒక సంస్థ రెండు కేంద్రాలుగా బిడ్ దాఖలు చేయవచ్చు. అయితే రెండు కేంద్రాల్లో అత్యధికంగా దాఖలు చేసినా.. ఒక జట్టును మాత్రమే కేటాయిస్తారు. బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ కూడా వేరే సంస్థలతో కలసి బిడ్ వేస్తున్నట్లు తెలుస్తున్నది.