- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరిశోధకులు నూతన ఆవిష్కరణలు చేయాలి : ఉపరాష్ట్రపతి
X
దిశ,వెబ్‌డెస్క్ : వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలపై పరిశోధకులు మరింత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఇన్నొవేటివ్ అచీవ్‌మెంట్స్ – 2020 అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాల వేదిక ద్వారా మంగళవారం ఆయన ప్రసంగించారు.
ఈ సంద్భరంగా పంట ఉత్పత్తులను భద్రపరచుకోవడం, ప్రాసెసింగ్, రవాణా తదితర అంశాల్లో వినూత్న పద్ధతుల దిశగా పరిశోధనలు సాగాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు వెంకయ్యనాయుడు సూచించారు. విద్యావిధానంలో ఆవిష్కరణలు, సృజనాత్మకతకు మరింత ప్రాధాన్యతనివ్వాలని, అప్పుడే విద్యార్థుల్లో ఉన్నతమైన ఆలోచనలకు.. తద్వారా కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తంచేశారు.
Advertisement
Next Story