మరో జనరేషన్ స్టార్ట్ అయింది..

by Anukaran |   ( Updated:2020-10-31 08:41:16.0  )
మరో జనరేషన్ స్టార్ట్ అయింది..
X

దిశ, వెబ్‌డెస్క్ :
టాలీవుడ్‌లో మరో జనరేషన్ స్టార్ట్ కాబోతుంది. ‘నిర్మల కాన్వెంట్’ సినిమాతో శ్రీకాంత్ కొడుకు రోషన్, ‘మెహబూబా’ మూవీతో పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి ఇప్పటికే హీరోలుగా ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం రోషన్ ‘పెళ్లి సందడి 2’, ఆకాష్ ‘రొమాంటిక్’ చిత్రాలు చేస్తూ తమ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరో వైపు చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ కూడా దూకుడు మీదున్నాడు. ఇప్పటికే ‘ఓ బేబీ’ సినిమాలో బుల్లి హీరోగా కనిపించి మెప్పించిన తేజ.. ఇప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మలయాళీ సూపర్ హిట్ మూవీ ‘ఇష్క్’ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మరో వారసుడు వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

దేవదాసు కనకాల వారసత్వంగా రాజీవ్ కనకాల, తన సోదరి శ్రీలక్ష్మి.. సినిమాలు, సీరియల్స్ ద్వారా నటులుగా రాణించారు. ఈ కుటుంబం నుంచే సుమ కూడా బుల్లితెరపై యాంకర్‌గా మకుటం లేని మహారాణి అనిపించుకుంది. ఇక ఈ జనరేషన్‌ విషయానికొస్తే రాజీవ్ – సుమల కుమారుడు రోషన్ నటనా వారసుడిగా వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్నాడని టాక్. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథ ఒకటి ఇప్పటికే సిద్ధం అవ్వగా.. విజయ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని టాక్.

Advertisement

Next Story

Most Viewed