కొత్త ఫుడ్ ట్రెండ్: ప్యాన్‌కేక్ సెరియల్స్

by Shyam |
కొత్త ఫుడ్ ట్రెండ్: ప్యాన్‌కేక్ సెరియల్స్
X

దిశ, వెబ్‌డెస్క్:
లాక్‌డౌన్ టైమ్‌లో అందరూ కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నారు. వాటి తయారీ విధానాన్ని, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాటిలో కొన్ని మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యి, ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. మొన్నటికి మొన్న డాల్గోనా కాఫీ ట్రెండ్ అవగా, ఇప్పుడు కొత్తగా ప్యాన్‌కేక్ సెరియల్స్ ట్రెండ్ అవుతోంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. మరి దాని సంగతేంటో కూడా చూద్దాం.

ప్యాన్‌కేక్ సెరియల్స్ లేదా చిన్న ప్యాన్‌కేక్స్ అనొచ్చు. అంటే చిన్న ఊతప్పలు అన్నమాట. ఇవి రెడీ చేసుకుని వాటి మీద డిజైన్లుగా చాక్లెట్ సిరప్ పోసి గార్నిష్ చేయడమే. అందుకోసం ప్యాన్‌కేక్ పిండిని (ఇన్‌స్టంట్‌గా కూడా దొరుకుతుంది) కవర్లో గానీ ఏదైనా బ్యాటర్ వేసే దానిలో గానీ పోసుకుని చిన్న చిన్న ప్యాన్‌కేక్‌లు పోసుకుని రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేటులోకి తీసుకుని దాని మీద తేనేతో గానీ, పాల క్రీమ్‌తో గానీ, చాక్లెట్ సిరప్‌తో గానీ గార్నిష్ చేసుకోవాలి. అంతే… ప్యాన్‌కేన్ సెరియల్స్ రెడీ!

Tags: corona, covid, lockdown recipes, dalgona coffee, pancake cereal, miniature pancakes, chocolate syrup

Advertisement

Next Story