- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూర్పు హిమాలయాల్లో అరుదైన పక్షి.. పిక్స్ వైరల్
దిశ, ఫీచర్స్: వైవిధ్యమైన వృక్షాలు, భిన్న రకాల జంతువులు, వర్ణించలేనన్ని పక్షులు మనతో పాటే భూమ్మీద నివసిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో జీవజాతులు అంతరించిపోగా, మరెన్నో కాలగర్భంలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వందల ఏళ్లుగా శాస్త్రవేత్తలు అరుదైన, అద్భుతమైన జీవవైవిధ్యాన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో పక్షులు, జంతువులను వాళ్లు గుర్తించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీహెచ్‌ఎన్‌ఎస్) పరిశోధకుల బృందం తూర్పు హిమాలయాల్లో పక్షులపై సర్వే చేస్తొంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా త్రీ-బ్యాండెడ్ రోజ్‌ఫించ్ అని పిలిచే అరుదైన పక్షి జాతిని తాజాగా కనుగొంది.అరుణాచల్‌ప్రదేశ్‌లోని శంఖాకార అడవుల్లో ఇది దర్శనమిచ్చింది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్, వెస్ట్ కామెంగ్ జిల్లాల మధ్య, సెలా పాస్ శంఖాకర అడువుల్లో, సముద్ర మట్టానికి 3,852 మీటర్ల ఎత్తులో త్రీబ్యాండెడ్ రోజ్‌ఫించ్ జంట పక్షులు కనిపించాయి. అందులో ఒకటి మేల్ కాగా, మరోకటి ఫిమేల్. తెల్లటి నుదురుతో ఉండే రోజ్‌ఫించ్ పక్షులు అరుణాచల్‌ప్రదేశ్‌లో కనిపిస్తుంటాయి. వాటితో పాటు ఈసారి త్రీబ్యాండెడ్ రోజ్ ఫించ్ పక్షులను శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ పక్షులు చైనా నుంచి భూటాన్‌కు వలస వెళుతుండగా ఈ ప్రాంతంలో ఆగిపోయి ఉండొచ్చని పరిశోధకల బృందం భావిస్తోంది. సాధారణంగా ఈ పక్షులు తక్కువ ఎత్తులోనే ఎగురుతుంటాయి. కానీ ఈ జంట పక్షులు మాత్రం సాధారణ నివాస ఎత్తు కంటే ఎక్కువ స్థాయిలో ఎగురుతుండటం, ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తుండటంతో..ఈ జాతిపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలకు మరింత అవకాశం దక్కింది.
ఈ పక్షులు ఫ్రింగిల్లిడే పక్షుల కుటుంబానికి చెందినవి. ఇందులో 200 కంటే ఎక్కువ జాతులున్నాయి. దక్షిణ చైనా, భూటాన్‌లలో కనిపించే ఫించ్ పక్షులు శీతాకాలంలో ఇవి నైరుతి చైనా నుంచి భారత్‌కు వలస వస్తుంటాయని అధ్యయనకర్త గిరీశ్ జాథర్ తెలిపారు. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లోని పది రకాల ఫించ్‌లు ఉన్నాయని, వాటి సంఖ్య ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రస్తుతం వాటిపై అధ్యయనం జరుగుతుందన్నారు. వీటిపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందని విషయాలపై త్వరలో అధ్యయనం చేయనున్నామన్నారు.
ఈ ఆవిష్కరణ తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలలోని జాతులు సంఖ్య 1,340కు చేరుకుంది. భారతదేశంలో పక్షుల జాతి క్రమంగా పెరుగుతోందని, 2021లోనే పక్షుల జాబితాలో కొత్తగా ఐదు జాతులు చేర్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. వాటిలో పసిఫిక్ గోల్డెన్ ప్లోవర్, గాడ్వాల్, రడ్డీ షెల్డక్స్ పక్షులను అక్టోబర్-మార్చి వలస కాలంలో తమిళనాడులోని తిరుప్పూర్ సమీపంలో ఉన్న నంజరాయణ ట్యాంక్‌లో మొదటిసారి గుర్తించారు.