కశ్మీర్‌లో నవశకం మొదలైంది: మనోజ్ సిన్హా

by Shamantha N |
కశ్మీర్‌లో నవశకం మొదలైంది: మనోజ్ సిన్హా
X

శ్రీనగర్: కశ్మీర్‌లో నవశకం మొదలైందని, అభివృద్ధి, సామాజిక శాంతి నెలకొల్పే లక్ష్యాన్ని ఇంకా నెరవేర్చాల్సి ఉన్నదని జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్తగా ఎంపికైన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. సమానత్వం, సమన్యాయం క్రమంగా నెలకొంటుందని వివరించారు. శ్రీనగర్‌లోని షేర్ ఈ కశ్మీర్‌ స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇన్సానియత్(మానవత్వం), జమూరియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్‌లు తీవ్రవాదం, స్వార్థం, విద్వేషంతో క్రమంగా పలుచనయ్యాయని, ప్రత్యేకమైన కశ్మీరీ సంస్కృతి వర్గవాదనలతో ఓడిపోయిందని వివరించారు. అధికరణం 370, 35ఏ రద్దు గురించి ప్రస్తావిస్తూ కశ్మీర్‌లో నవశకానికి నాందీ పడిందని, గతేడాదే ప్రగతికి అనేక సంస్కరణలు జరిగాయని తెలిపారు. కశ్మీరీల పురోభివృద్ధికి తమ అడ్మినిస్ట్రేషన్ ఐదు లక్ష్యాలను నిర్దేశించుకున్నదని వెల్లడించారు. పారదర్శక పాలన, ప్రజాస్వామిక మూలాలు నెలకొల్పడం, సంక్షేమ పథకాల విస్తరణ, కశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉండటం, ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి కల్పనలు తమ ప్రాథమిక ప్రాధమ్యాలని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed