ఇరుదేశాల మైత్రిలో కొత్త శకం : మోడీ

by Shamantha N |   ( Updated:2022-08-19 08:07:16.0  )
ఇరుదేశాల మైత్రిలో కొత్త శకం : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనను ప్రధాని మోడీ ఇరుదేశాల మధ్య సహకారం, సాన్నిహిత్యానికి కొత్త శకంగా అభివర్ణించారు. ట్రంప్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు. సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. ట్రంప్‌కు యావత్ భారతం ఘనస్వాగతం పలుకుతున్నదని అన్నారు. 'మనం అహ్మదాబాద్‌లో ఉన్నాం కానీ, ఈ ఉత్సాహం యావత్ భారత్‌ది' అని పేర్కొన్నారు. ఐదు నెలల క్రితం అమెరికాలోని హూస్టన్ నగరంలో నిర్వహించిన 'హౌడీ మోడీ' ఈవెంట్‌తో తన తొలి అమెరికా పర్యటన ప్రారంభమైందని తెలిపన మోడీ.. భారత్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమంతో డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో తొలిసారిగా అడుగుపెట్టారని వివరించారు. ఈ పర్యటన చారిత్రాత్మకమని అన్నారు.

సింధూ హరప్పా నాగరికత విలసిల్లిన చారిత్రతక ప్రాంతంలో నివసిస్తున్న మన చరిత్ర ఘనమైనదని తెలిపారు. అమెరికా.. ఫ్రీలాండ్ అయితే.. భారత్ ప్రపంచంలోనే పెద్దప్రజాస్వామ్యమని అన్నారు. అమెరికన్లు స్టాచ్యు ఆఫ్ లిబర్టీని చూసి గర్వపడితే.. భారతీయులు స్టాచ్యు ఆఫ్ యూనిటీని చూసి గర్వపడతారని చెప్పారు. ట్రంప్ నాయకత్వంలోని అమెరికాతో.. భారత్ మరింత దృఢమైన సంబంధాలను ఏర్పరుచుకుంటుందని తెలిపారు.

ట్రంప్ ప్రసంగం తర్వాత కృతజ్ఞతలు చెబుతూ.. మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కేవలం భారత్‌లో నివసిస్తున్నవారినే కాదు.. అమెరికాలోని భారత ప్రవాసులనూ గౌరవిస్తారని చెప్పారు. వాషింగ్టన్‌లో ట్రంప్‌ను మొదటిసారి కలిసినప్పుడు.. వైట్‌హౌజ్‌లో భారతీయులకు విశ్వసనీయమైన మిత్రుడు ఉన్నాడని చెప్పినట్టు గుర్తుచేశారు. వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలు చేసుకోవడం ట్రంప్ మాట్లాడారని చెబుతూ.. అలాగైతే.. అమెరికాలోని 40లక్షల మంది భారతీయులు ఆ దేశ పురోభివృద్ధిలో పాలుపంచుకుంటారని వివరించారు.

Advertisement

Next Story