ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు

by srinivas |
ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కర్ఫ్యూ సడలింపులపై ఇవాళ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇంతకుముందులాగే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉండనుంది.

ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తాయని ప్రభుత్వం తెలిపింది. షాపులు 5 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 21 నుంచి 30 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed