- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనా లో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ షురూ..
దిశ, వెబ్ డెస్క్ : కరోనా పుట్టినింట మరోసారి మహమ్మారి విజృంభిస్తున్నది. రాజధాని బీజింగ్ తో మొదలుకొని అన్ని ప్రాంతాలకు క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ కేసులు ఎలా వ్యాప్తి చెందాయి అనే దాని పై అధికారులు ఆరా తీస్తున్నారు. సెంట్రల్ జిల్లాలైన చాయంగ్, హైడియన్ లలో ఇవాళ కొత్తగా ఆరు కేసులు నమోదు అయ్యాయి. అప్రమత్తం అయిన అధికారులు ముందస్తు చర్యలు మొదలు పెట్టారు.
కొత్తగా కరోనా సోకిన వ్యక్తులు ఏఏ ప్రాంతాలలో తిరిగారో తెలుసుకుని అక్కడ కరోనా నియంత్రణ చర్యలు ప్రారంభించారు. డాంగ్ చెంగ్ లోని రాఫెల్స్ సిటీ మాల్ ను నిన్న సాయంత్రం నుంచే మూసివేశారు. మాల్ లో పని చేస్తున్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అదృష్టవ శాత్తూ ఎవరికీ పాజిటివ్ రాలేదు. దాంతో మాల్ మొత్తం శుభ్రం చేయించి మూసివేశారు.
అంతేకాకుండా చుట్టు పక్కల ఉన్న ఒక స్కూల్, నాలుగు కాలనీలు, మరో రెండు ఆఫీసుల దగ్గర లాక్ డౌన్ విధించారు. అక్కడ సంచరించిన వారికి, నివాసం ఉంటున్న వారందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. లాక్ డౌన్ పెట్టిన ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి కావల్సిన ఆహారం, ఇతరత్రాలను అందిస్తున్నారు.
చాయోయంగ్, హైడియన్ జిల్లాల్లో సుమారు 285 మందికి కరోనా టెస్టులు చేశారు. అనుమానం వచ్చిన 1250 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా చేశారట. చిన్న చిన్న పాములను అయినా పెద్ద పెద్ద కర్రలతో కొట్టాలి అనుకున్నారో ఏమో గానీ, మొత్తానికి కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇంకా రానున్న కాలంలో ఇలాగే కేసుల సంఖ్య పెరిగితే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని చైనా అధికార వర్గాలు తెలిపాయి. అయితే దేశీయంగా ప్రయాణాలు పెరగడం. విందులు వినోదాలకు పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడటం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. కరోనా వేగంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.