దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే

by Anukaran |
Corona virus
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా కొత్త కేసులు 90వేలను క్రాస్ చేశాయి. గడిచిన 24 గంటల్లో మరో 93,249 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇదే వ్యవధిలో 513 మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. కరోనా మహమ్మారి పీక్ స్టేజ్‌లో ఉండగా గతేడాది సెప్టెంబర్‌లో ఇంచుమించు పదిసార్లు కొత్త కేసులు 90వేలను దాటాయి. తాజాగా మళ్లీ ఇదే తొలిసారి. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కు చేరాయి. యాక్టివ్ కేసులు 6,91,597కు పెరిగాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణ:గా 1,64,623గా మరణించారు. గతేడాది సెప్టెంబర్ 17న మనదేశంలో అత్యధికంగా 97,894 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed