- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
5.5 శాతం తగ్గిన బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ జీవిత బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మేలో 5.5 శాతం క్షీణతను నమోదు చేశాయి. గతేడాది ఇదే నెలలొ రూ. 13,739 కోట్లతో పోలిస్తే 24 జీవిత బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం మేలో రూ. 12,976.99 కోట్లను వసూలు చేశాయి. గతేడాది ఏప్రిల్‌లో కరోనా మహమ్మారి కారణంగా తక్కువ బేస్ ఎఫెక్ట్ వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో 44.76 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రైవేట్ బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం మేలో 14 శాతం పెరిగింది. ప్రభుత్వం రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) వార్షిక ప్రతిపదికన 12.3 శాతం క్షీణించింది. ప్రైవేట్ బీమా సంస్థల వృద్ధి సానుకూలంగా నమోదవడం తక్కువ బేస్ ఎఫెక్ట్ వల్లనే అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ గతేడాది నమోదు చేసిన కొత్త వ్యాపార ప్రీమియం కంటే చాలా తక్కువగా ఉంది. 2020లో మేలో రూ. 10,211.53 కోట్ల నమోదు కాగా, ఈ ఏడాది మేలో ఇది రూ. 8,947.64 కోట్లుగా వెల్లడించింది. దిగ్గజ ప్రైవేట్ రంగ బీమా సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సె లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు గత నెల అధికంగా రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఎస్‌బీఐ జీవిత బీమా గతేడాది కంటే స్వల్పంగా వృద్ధిని సాధించింది. మరో దిగ్గజ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 3,29 శాతం క్షీణించింది.