- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోహన్‌బగాన్‌కు షాక్.. నార్త్‌ఈస్ట్ యునైటెడ్ విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఏటీకే మోహన్ బగాన్ క్లబ్‌కు ఐదో స్థానంలో ఉన్న నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్ షాకిచ్చింది. మంగళవారం రాత్రి ఫర్టోడా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 2-1 తేడాతో మోహన్ బగాన్‌పై విజయం సాధించింది. తొలి అర్దభాగంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గోల్ పోస్టుపై పలుమార్లు దాడులు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. తొలి అర్దభాగంలోఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. రెండో అర్ధభాగంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ దూకుడు పెంచింది.
60వ నిమిషంలో ఫెడ్రికొ గలాగో ఇచ్చిన పాస్‌ను లూయిస్ మచాదో గోల్‌గా మలిచాడు. దీంతో నార్త్ఈస్ట్ యునైటెడ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. అయితే 72వ నిమిషంలో ఏటీకే మోహన్ బగాన్ కెప్టెన్ రాయ్ కృష్ణ అద్భుతమైన గోల్ చేసి స్కోర్‌ను 1-1కి సమం చేశాడు. మరి కొద్ది సేపటికే 81వ నిమిషంలో ఫెడ్రికో గలాగో గోల్ చేసి నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ను 2-1 ఆధిక్యంలోకి తీసుకొని వెళ్లాడు. నిర్ణీత సమయంలోపు మోహన్ బగాన్ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో నార్త్ఈస్ట్ యునైటెడ్ 2-1 తేడాతో విజయం సాధించింది. రోచర్జెలాకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, ఫెడ్రికో గలాగోకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.