బాలీవుడ్ మారదా?

by Jakkula Samataha |

బాలీవుడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలు ఓటీటీ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిస్నీ + హాట్ స్టార్‌లో ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వీటిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘దిల్ బెచారా’, అక్షయ్ కుమార్ ‘లక్ష్మీబాంబ్’, అలియా భట్ ‘సడక్ 2’, అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్ బుల్’, అజయ్ దేవగన్ ‘బుజ్’, విద్యుత్ జమాల్ ‘ఖుదా హఫీజ్’, కునాల్ ఖేము ‘లూట్ కేస్’ చిత్రాలు ఉన్నాయి.

కాగా, ఈ బిగ్ డీల్ గురించి అనౌన్స్ చేసేందుకు బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేసింది డిస్నీ+ హాట్ స్టార్. కానీ ఈ సినిమాల్లో ‘దిల్ బెచారా’ హీరో సుశాంత్ మరణించగా.. ఆయనకు ఎలాగూ ఆహ్వానం పంపలేరు. ఇక మిగిలిన ఆరుగురు లీడ్ యాక్టర్స్‌లో అలియా, అక్షయ్, అజయ్, అభిషేక్ బచ్చన్‌లకు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం పంపిన డిస్నీ + హాట్ స్టార్.. మిగిలిన ఇద్దరు అంటే విద్యుత్ జమాల్, కునాల్ ఖేములకు ఆహ్వానం పంపలేదు. కాగా సుశాంత్ మరణం తర్వాత నెపోటిజంపై పెద్ద చర్చే జరుగుతుండగా.. ఈ టైమ్‌లో ఏ తప్పయితే చేయొద్దో, అదే తప్పు చేసింది ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్. దీంతో ఆహ్వానం అందని ఇద్దరు హీరోలు.. బాహాటంగానే దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు .

బాలీవుడ్‌కు హోమ్ డెలివరీ అంటూ డిస్నీ + హాట్‌స్టార్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్‌పై సినీ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయగా.. దీనిపై స్పందించారు విద్యుత్ జమాల్. ‘ఇది నిజంగా బాలీవుడ్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్. కానీ ఏడు సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు కేవలం ఐదు సినిమాలు రిప్రజెంట్ చేసేందుకు మాత్రమే ఆహ్వానం పలికారు. మరి మిగతా రెండు సినిమాల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. అంటే నెపోటిజం మళ్లీ కంటిన్యూ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక కునాల్ ఖేము కూడా అదే రేంజ్‌లో ఆన్సర్ ఇచ్చాడు. ‘ప్రేమ, గౌరవాన్ని ఎవరూ అడుక్కోరు.. సంపాదించుకుంటారు. ఎవరైనా అవి మనకు ఇవ్వలేదంటే మనల్ని చిన్నగా చేయలేవు. కానీ మేము ఆడేందుకు కూడా ఒక ఫీల్డ్ ఇవ్వండి. మేము కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించి చూపిస్తాం’ అన్నారు.

https://twitter.com/kunalkemmu/status/1277578026314653698?s=19

కాగా ఈ ఘటనపై మండిపడుతున్నారు నెటిజన్లు. సుశాంత్ మరణం తర్వాత కూడా ఇదే పద్ధతిలో వెళ్తున్న బాలీవుడ్‌పై మండిపడుతున్నారు. ఒకవైపు నెపోటిజంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నా.. బాలీవుడ్‌ను ‘బాయ్‌కాట్’ చేయాలని డిసైడైనా సరే.. ఇదే పంథాలో వెళ్తున్నారంటే ఏమనుకోవాలి? అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story