అరవింద స్వామికి వార్నింగ్

by Shyam |
అరవింద స్వామికి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యాండ్సమ్ అరవింద స్వామి మళ్లీ బిజీ అయిపోయారు. వరుసగా సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘తలైవి’లో ఎంజీ రామచంద్రన్‌గా కనిపిస్తున్న ఆయన.. ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా టికెట్ ధరలపై అరవింద స్వామి చేసిన ట్వీట్ నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. సినిమా టికెట్ల ధరలో ఎందుకు రిస్ట్రిక్షన్స్ ఉండాలని ప్రశ్నించిన ఆయన.. డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కు సేమ్ ప్రైస్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అలాగే సినిమా సినిమాకు బడ్జెట్ చేంజ్ అవుతున్నప్పుడు.. అన్ని సినిమాలకు టికెట్ మాత్రం ఒకే ధరలో ఎందుకుండాలన్నారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నప్పుడు.. సినిమా టికెట్‌ ధరల విషయంలో మాత్రం ఎందుకు పరిమితులుండాలని అరవిందస్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాగా దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు ఇలాంటి లాజిక్ ట్వీట్స్‌తో అవసరంగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ముందుగా నటీనటులు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే.. సినిమా బడ్జెట్ అదుపులో ఉంటుందన్నారు. ముందు మీరు మారండి.. అంతేకాని టికెట్ల ధరలను పెంచి ఆడియన్స్‌పై భారం పెంచే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్‌తో పోలిస్తే సినిమా వాళ్లు కేవలం రెండేళ్లలోనే కార్లలో ఎలా తిరుగుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా మరికొందరు అరవింద స్వామి ట్వీట్‌ను సమర్థిస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story