మిస్టర్ పర్ఫెక్ట్‌పై నెటిజన్స్ ఫైర్

by Shyam |
మిస్టర్ పర్ఫెక్ట్‌పై నెటిజన్స్ ఫైర్
X

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కోసం ఇస్తాంబుల్ వెళ్లిన అమీర్.. టర్కీ ప్రథమ మహిళ ఏమిన్ రోగన్‌ను కలవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా చిత్రీకరణ ఇస్తాంబుల్‌లో జరగడం.. అమీర్ ఖాన్‌ను కలవడం సంతోషంగా ఉందంటూ ఏమిన్ ట్వీట్ చేసింది. దీంతో ఇండియన్స్ అమీర్‌పై మండిపడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసిన టర్కీ ఫస్ట్ లేడీని కలవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇంతకుముందు భారత మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యూహ్‌ను కలిసేందుకు నిరాకరించిన అమీర్ ఖాన్.. ఇప్పుడెందుకు ఇలా చేశాడని మండిపడుతున్నారు.

కాగా, కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రం షూటింగ్.. కరోనా కారణంగా వాయిదా పడటంతో తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్. వచ్చే ఏడాది క్రిస్మస్ రోజున సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story