- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాతీయ జెండాను అవమానించిన 'ఆర్ఆర్ఆర్' హీరో.. ఫైర్ అవుతున్న నెటిజన్స్
దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర దినోత్సవ రోజున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిక్కులో పడ్డాడు. కరోనా నిబంధనలు పాటిస్తూ దేశ ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర ప్రజానీకం వేడుకల్లో మునిగి తేలుతుండగా.. చెర్రీ జాతీయ జెండా వేడుకల్లో వివాదం చుట్టుముట్టింది. గత కొన్నేళ్లుగా రామ్ చరణ్ ఒక ప్రముఖ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ మొబైల్ కంపెనీ చరణ్ తో తమ కస్టమర్లకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపుతూ ఒక యాడ్ విడుదల చేసింది. చరణ్ ఫొటోతో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది. ఈ యాడ్ లో చరణ్ తెలుపు వర్ణం బట్టలు ధరించి జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, చరణ్ పట్టుకున్న జెండా మధ్యలో అశోక చక్రం లేదు. దీంతో సంస్థతో పాటు చరణ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
చరణ్ జాతీయ జెండాను అవమానించాడని తెలుపుతూ ట్విట్టర్ లో చరణ్ పై ట్రోల్స్ వేస్తున్నారు. సాధారణంగా అశోక చక్రం లేనిదే జాతీయ జెండా ఉండదు. ఇంకా చెప్పాలంటే జెండా చట్ట ప్రకారం అశోక చక్రం లేకుండా జెండా రూపొందించడమే పెద్ద నేరం.అయితే ఈ విమర్శాల్పి ప్రముఖ సంస్థ క్లారిటీ ఇచ్చింది. “వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను వాడటం అనేది నేరం… ప్రకటనలు ఇచ్చుకునేటప్పుడు జాతీయ జెండాను పోలి ఉండేలా త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడాలి. అందుకే మధ్యలో అశోక చక్రాన్ని వాడలేదు. ఇది తప్పు కాదు, నేరం అంతకన్నా కాదు” అంటూ వివరణ ఇచ్చింది. కానీ, నెటిజన్లు మాత్రం సంస్థ ఎలా చెప్తే అలా వినడమేనా, హీరోలు అన్నాకా మీక్కూడా కొన్ని తెలిసి ఉండాలి కదా..? పొరపాటున తప్పు జరిగితే.. నెటిజన్స్ అనేది హీరోలేనేగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది.