- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాక్సిడెంట్‌లో యువకుడి మృతి.. ఇసుక తీయండంటూ నెటిజన్లు ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు పై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించినా కొందరి నిర్లక్ష్యానికి యువకుడు బలి కావాల్సి వచ్చింది. ఇటీవల సినీ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ పై వెళ్తూ రోడ్డుపై ఇసుక ఉండటంతో స్కిడ్ అయి పడిపోయిని సంఘటన తెలిసిందే. అయితే, ఆ ప్రమాదంలో గాయపడిన తేజ్‌ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, కేవలం తేజ్‌కి యాక్సిడెంట్ జరిగిన చోట ఇసుకను తొలగించిన అధికారులు చేతులు దులుపుకున్నారు. కానీ నగరవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.
తాజాగా, కాటేదాన్ పాత కర్నూలు రోడ్డు దర్గా వద్ద ఇసుక పేరుకుపోవడంతో బైక్ స్కిడ్ అయి శివకుమార్ అనే యువకుడు మృతి చెందారు. శివ కుమార్ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ, ఇదే సమయంలో వెనుక నుంచి కంటైనర్ రావడంతో కడుపు మీద నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో శివకుమార్ అక్కడికక్కడే మరణించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇంజనీరింగ్ అధికారుల్లో మార్పు రాకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాహనదారుడు నిబంధనలు పాటించకపోతే ఫైన్ వేసే పోలీసులు, ఇలా అధికారుల నిర్లక్ష్యంతో అమాయకులు బలవుతున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించి పునరావృతం కాకుండా చూడాలని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
- Tags
- Accidents