- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామి భయ్యా.. 'కాలూ'కి పలు అర్థాలున్నాయ్!
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు ఆడుతున్న సమయంలో తనను ‘కాలూ’ అని కొంత మంది పిలిచేవారని, అప్పట్లో దాని అర్థం తెలవకపోయినా ఇప్పుడు అదొక జాత్యహంకార పదమని తెలుసుకున్నట్లు డారెన్ సామి చెప్పిన విషయం తెలిసిందే. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత సామి ఈ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తనను కాలూ అని పిలిచిన వారందరూ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే వారి పేర్లు బహిర్గతపరుస్తానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఒక ట్విట్టర్ యూజర్ సామి ఆరోపణలపై స్పందించాడు. ‘సామి భయ్యా.. కాలూ అనే పదానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. అవి సందర్భానుసారంగా మారిపోతుంటాయని చెప్పాడు. చనిపోయిన మా అమ్మమ్మ నన్ను కాలూ అని ముద్దుగా పిలిచేది. ఇందులో ఎంతో ఆప్యాయత ఉంది. ఎదుటి వాళ్లు మనల్ని ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో ఈ పదం ద్వారా కూడా తెలుస్తుంది. కాలూ అనేది ప్రతి సమయంలో జాత్యాహంకార పదం కాదు’ అని మెసేజ్ చేశాడు. దీనికి సామి స్పందిస్తూ ‘నువ్వు చెప్పేది నిజం కావొచ్చు. కానీ, నాకు మాత్రం అలా అనిపించడం లేదు’ అని రిప్లై ఇచ్చాడు.