- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
91 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రెట్టింపు వృద్ధితో రూ. 2.49 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయి. ఇవి ప్రధానంగా వ్యక్తిగత ఆదాయ పన్ను, అడ్వాన్స్ పన్ను వసూళ్ల మద్దతుతో జరిగినట్టు ఆదాయ పన్ను శాఖా వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 1 నుంచి జులై 3 మధ్య మొత్తం రూ. 2.49 లక్షల కోట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ. 1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ఇది 91 శాతం వృద్ధి. ఆర్థికవ్యవస్థపై కరోనా మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 2.86 లక్షల కోట్లు చేరుకోగా, గతేడాది ఇదే సమయంలో రూ. 1.94 లక్షల కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత పన్నులు, సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్ఐటీ) ఉన్నాయి. ప్రత్యక్ష పన్ను వసూళ్ల ధోరణి సంతృప్తికరంగా ఉందని ఐటీ విభాగం అధికారులు తెలిపారు.