నెల్సన్ మండేలా కూతురు కన్నుమూత

by Anukaran |   ( Updated:2020-07-13 04:04:06.0  )
నెల్సన్ మండేలా కూతురు కన్నుమూత
X

జోహన్నెస్‌బర్గ్: నల్లజాతీయుల హక్కుల పోరాట వీరుడు, దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిన్న కూతురు జిండ్జి మండేలా(59) సోమవారం కన్నుమూశారు. నెల్సన్ మండేలా, విన్ని మడికిజెలా మండేలా రెండో కుమార్తె జిండ్జి జొహన్నెస్‌బర్గ్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించారు. అయితే, ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. డెన్మార్క్‌కు రాయబారిగా పనిచేస్తున్న జిండ్జి స్వతహాగా పోరాట యోధురాలుగా కీర్తికెక్కారు. ‘మన నిజమైన రాయబారి దేశాన్ని వదిలివెళ్లారు. మనదేశ ధైర్య సాహసాల చాంపియన్‌ను మనం కోల్పోయామని, జిండ్జి ఆత్మకు శాంతి చేకూరాల’ని పేర్కొంటూ కేప్‌టౌన్ ఈటీసీ న్యూస్ పోర్టల్ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story