- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొల్లు కాదు.. సొల్యూషన్ చెప్పండి : మోడీపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారినపడి క్వారంటైన్‌లో ఉన్నా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శల దాడిని తగ్గించడం లేదు. మునపటిలాగే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతున్నారు. రెండ్రోజుల క్రితం జాతినుద్దేశించి మోడీ ప్రసంగించినా.. దానిని పసలేని ప్రసంగంగా రాహుల్ అభివర్ణించారు. ప్రసంగాలు చెప్పడం మాని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపండని డిమాండ్ చేశారు. కరోనా రావడంతో ఢిల్లీలోని ఆయన నివాసంలో హోంక్వారంటైన్‌లో ఉన్న రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘నేను ఇంట్లో క్వారంటైన్ అయి ఉన్నాను. కానీ దేశం నలుమూలల నుంచి బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఈ దుస్థితికి కరోనా ఒక్కటే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు. దేశానికి పసలేని ప్రసంగాలు, పనికి రాని ఉత్సవాలు (టీకా ఉత్సవంను ఉద్దేశిస్తూ..) అవసరం లేదు. సంక్షోభానికి పరిష్కారం కావాలి..’ అని ట్వీట్ చేశారు. కేంద్రం వ్యాక్సిన్ స్ట్రాటజీ కూడా పెద్ద నోట్లరద్దుకు ఏమాత్రం తీసిపోదని రాహుల్ గాంధీ బుధవారం కామెంట్ చేసిన విషయం విదితమే.