మరిన్ని బ్యాంకులు అవసరం -సుబ్రమణియన్

by Harish |
మరిన్ని బ్యాంకులు అవసరం -సుబ్రమణియన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా మరిన్ని బ్యాంకులు, చెల్లింపు సంస్థల అవసరం ఉందని ఆర్థిక సలహాదారు కె వి సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ఆర్థికవ్యవస్థలో మరిన్ని బ్యాంకులకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, గూగుల్ పే, వాట్సాప్ పే లాంటి పేమెంట్ సేవల సంస్థల అవసరముందని పేర్కొన్నారు.

భారత్‌లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతొ సహా సుమారు 500-600 బ్యాంకులు మాత్రమే ఉండగా, మనదేశ జనాభాలో నాలుగో వంతు ఉన్న అమెరికాలో 26 వేల బ్యాంకుల నెట్‌వర్క్ ఉందని సుబ్రమణియన్ ప్రస్తావించారు. అమెరికాలో కేవలం అర డజను పెద్ద బ్యాంకులు మాత్రమే ఆధిపత్యం చెలాయించినప్పటీకీ, ఎక్కువ శాతం బ్యాంకులు ఎంఎస్ఎంఈ లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థికవ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు సుబ్రమణియం తెలిపారు.

భారత్‌లో మరిన్ని బ్యాంకులకు అనుమతి ఉంటే గనక చిన్న సంస్థలకు రుణాల లభ్యత మెరుగ్గా ఉండేదని చెప్పారు. అలాగే, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్దీపన చర్యలు ఉండొచ్చని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ స్థాయికి (రూ. 30.4 లక్షల కోట్లు) మించి ‘అదనపు ఆర్థిక వ్యయానికి’ అవకాశముందని చెప్పారు. దేశంలోని బలహీన వర్గాల తక్షణ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Next Story