బాలీవుడ్ డ్రగ్స్‌ కేసు..సెలబ్రెటీల డేటా సేకరణ

by Shamantha N |
బాలీవుడ్ డ్రగ్స్‌ కేసు..సెలబ్రెటీల డేటా సేకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో ఎన్సీబీ వేగం పెంచింది. కొద్దిరోజులగా పలువురు సెలబ్రెటీలను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత 45 రోజుల్లో 85 గాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సెలబ్రెటీలు, వారికి సంబంధించిన వ్యక్తుల సెల్‌ఫోన్లను సేకరించిన అధికారులు అందులో నుంచి డేటాను తీసుకుంటున్నారు. అయితే, బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణ నేపథ్యంలోనే బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో డ్రగ్స్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్సీబీ చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే వారి సెల్‌ఫోన్ల డేటాను కూడా సేకరిస్తోంది.

Advertisement

Next Story