మా ఆయన బాగున్నాడు : నజ్రియా

by Jakkula Samataha |
మా ఆయన బాగున్నాడు : నజ్రియా
X

దిశ, సినిమా : ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ‘మలయన్ కుంజు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఇటీవలే ఫాహద్‌ ముక్కుకు గాయం కాగా, వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు.. ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా గాయం చిన్నదే అని, ఫాహద్‌కు ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. అయితే ఆయనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు అతడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

దీంతో ఫాహద్ సతీమణి, నటి నజ్రియా ఫాహద్.. ఈ విషయంలో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ, అతడి ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు ‘ఆల్ ఈజ్ వెల్’ అని పోస్ట్ పెట్టడంతో పాటు తన భర్త ఫాహద్ బెడ్‌పై రెస్ట్ తీసుకుంటున్న ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది నజ్రియా. ఇక నాని హీరోగా వస్తున్న ‘అంటే సుందరానికీ’ చిత్రం ద్వారా బ్యూటీ డాళ్ నజ్రియా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.

Advertisement

Next Story