మానవుల చర్మంతో ఫొటో ఆల్బం

by Shyam |
మానవుల చర్మంతో ఫొటో ఆల్బం
X

దిశ, వెబ్‌డెస్క్:
మానవ చర్మంతో చేసిన ఫొటో ఆల్బం ఒకటి పోలాండ్ యాంటిక్ మార్కెట్‌లో దొరికింది. ఆల్బం కవర్ మీద టాటూ, వెంట్రుకలతో పాటు చెడు వాసన కూడా రావడంతో ఆ ఆల్బం తయారీ వెనక మానవత్వ దాడి ఉందని భావించి దాన్ని కొన్న వ్యక్తి ఆశ్విట్జ్ మెమోరియల్ మ్యూజియం వారికి అందించాడు.

ఆ ఫొటో ఆల్బం మీద పరిశోధన చేసి ఆనలిస్టులు అది కచ్చితంగా జర్మనీలోని బుషెన్‌వాల్డ్ క్యాంపు చెందిన నాజీ ప్రిజనర్‌కి చెంది ఉంటుందని వారు కనిపెట్టారు. ఈ బుషెన్‌వాల్డ్ క్యాంపులో బందీలను విపరీతంగా చిత్రహింసలు పెట్టి వారి మృతదేహాలతో వస్తువులు తయారుచేసే వారని ప్రతీతి.

ఈ క్యాంపుకి కార్ల్ ఒట్టో కోచ్ కమాండర్‌గా ఉండేవాడు. అతని భార్య ఇల్సే కోచ్ మహా క్రూరురాలు. ఆసక్తికలిగించే పచ్చబొట్లతో ఉన్న మగ బందీల శరీరాలను తనకు పంపించాలని భర్తను కోరేది. ఆ శరీరాల చర్మాన్ని తానే స్వయంగా ఒలిచి ల్యాంప్‌షేడ్లు, ఆల్బమ్‌లు, టేబుల్ కవర్లు తయారు చేసేది. అంతేకాదు వారి బొటనవేళ్లను లైటు స్విచ్ఛులుగా కూడా వాడుకునేది. అందుకే ఆమెకు ది లేడీ ఆఫ్ ది ల్యాంప్‌షేడ్ అని పేరు ఉంది. న్యూరెంబర్గ్ వార్ క్రైమ్స్ విచారణలో కార్ల్‌కి 1944లో ఉరిశిక్ష, 1947లో ఇల్సేకి జీవిత ఖైదు విధించారు. ఈ ఆల్బం కూడా ఇల్సే తయారు చేయించిన ఆల్బం అయ్యుంటుందని దాని కోసం వాడిన సాంకేతికత, పదార్థాల సమ్మేళనాలను బట్టి తెలుస్తోందని ఆశ్విట్జ్ మ్యూజియం కలెక్షన్స్ వారు ప్రకటించారు.

Tags: Human Skin, Photo Album, Ilse Koch, Karl Otto Koch, Found, Poland

Advertisement

Next Story

Most Viewed